ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్… తమిళనాడుకు ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు..

కరోనా నేపథ్యంలో 8 నెలల తర్వాత ఏపీ- తమిళనాడు మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఏపీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ సర్వీసులు

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్... తమిళనాడుకు ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు..

 APSRTC Bus Services : సామాన్యుడు రథ చక్రాలు ఇప్పుడిప్పుడు రోడ్డెక్కుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఇప్పుడు మరో అంతర్జాతీయ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా నేపథ్యంలో 8 నెలల తర్వాత ఏపీ- తమిళనాడు మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

ఏపీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి చెన్నైకి బస్సులు నడపనుంది. రాష్ట్రంలోని పలుచోట్ల నుంచి చెన్నైకి బస్సులు తిప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు వెళ్లే బస్సులకు రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించినట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.