వైరస్‌ను మించి బాధిస్తున్న అతి ప్రచారం..

సామజిక మాధ్యమాల్లో అతి ప్రచారం తలనొప్పులు తెస్తున్నది. కరోనా బాధితులను, వారి కుటుంబసభ్యులను మానసికంగా కుంగదీస్తున్నది. అప్రమత్తం చేయాల్సిన ప్రచారం హద్దు మీరుతున్నది. ‘కొవిడ్‌-19 వైరస్‌తో ఈ రోజు

వైరస్‌ను మించి బాధిస్తున్న అతి ప్రచారం..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 1:20 PM

Viral is more dangerous than virus: సామజిక మాధ్యమాల్లో అతి ప్రచారం తలనొప్పులు తెస్తున్నది. కరోనా బాధితులను, వారి కుటుంబసభ్యులను మానసికంగా కుంగదీస్తున్నది. అప్రమత్తం చేయాల్సిన ప్రచారం హద్దు మీరుతున్నది. ‘కొవిడ్‌-19 వైరస్‌తో ఈ రోజు దేశం మొత్తం యుద్ధం చేస్తున్నది. కానీ గుర్తుంచుకోండి.. మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో..’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరికి అవేమీ పట్టడంలేదు.

దుష్ప్రచారాన్ని తట్టుకోలేక వాటిని నమ్మొద్దంటూ సోషల్ మీడియా వేదికగా స్వయంగా బాధితులే వేడుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సాధారణ ఫ్లూలు ప్రబలే ఈ వర్షాకాలం సీజన్‌లో చిన్నపాటి అనారోగ్యాలు అనేవి సహజమైనందున.. సోషల్‌మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పోస్టులతో కాకుండా మాటలతో భరోసా ఇవ్వాలని చెప్తున్నారు.

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!