Crime News : దొంగలేమో అనుకున్నారు..మూకుమ్మడిగా దాడిచేశారు..చివరికి ఊహించని విషాదం…

చెన్నైలోని  తిరుచ్చి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గ్రామస్థులు చితకబాదడంతో ఓ యువకుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే... తిరుచ్చి జిల్లా అల్లియుర్ గ్రామంలో అనుమానాస్పదంగా....

Crime News : దొంగలేమో అనుకున్నారు..మూకుమ్మడిగా దాడిచేశారు..చివరికి ఊహించని విషాదం...

Updated on: Dec 26, 2020 | 5:25 PM

Crime News :  చెన్నైలోని  తిరుచ్చి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గ్రామస్థులు చితకబాదడంతో ఓ యువకుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే… తిరుచ్చి జిల్లా అల్లియుర్ గ్రామంలో అనుమానాస్పదంగా ఓ ఇంటి ముందు  ముగ్గురు యువకులు తారసలాడారు. గమనించిన గ్రామస్థులు వారు దొంగతనానికి వచ్చారని భావించారు. ఈ సమచారాన్ని గ్రామ అంతటా విస్తరించారు. ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆ ముగ్గురు యువకులపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.  యువకుల్లో ఒకరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో యువకుడు తప్పించకుని పరారయ్యాడు. అసలు వారు నిజంగా దొంగలేనా..ఆ సమయంలో అక్కడ ఎందుకు తచ్చాడారు..వంటి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read : 

Raja singh VS Silpa Chakrapani: ‘ఎనీ టైమ్ నేను రెడీ..రాజీనామాకు నువ్వు రెడీనా’..రాజాసింగ్‏కు శిల్పా చక్రపాణి సవాల్

Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం

Andhrapradesh: ఆర్థిక వివాదాల పరిష్కారానికి ఏపీలో ప్రత్యేక కోర్టులు..ఆన్‌లైన్‌ ద‌్వారానే ఫిర్యాదులు..ఆరు నెలల్లో పరిష్కారం