‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

|

Apr 08, 2020 | 1:13 PM

Vikram Vedha Telugu Remake: తమిళ హీరోలు మాధవన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్‌వేద’. ఈ సినిమాకు పుష్కర్, గాయత్రి దర్శకులు. 2017లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా సేతుపతి యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ మూవీ ‘పింక్’ రీమేక్‌లో నటించిన పవన్ కళ్యాణ్.. ‘విక్రమ్ […]

విక్రమ్‌వేద రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!
Follow us on

Vikram Vedha Telugu Remake: తమిళ హీరోలు మాధవన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్‌వేద’. ఈ సినిమాకు పుష్కర్, గాయత్రి దర్శకులు. 2017లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా సేతుపతి యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హిందీ మూవీ ‘పింక్’ రీమేక్‌లో నటించిన పవన్ కళ్యాణ్.. ‘విక్రమ్ వేద’ను తెలుగుతో రవితేజతో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని టాక్. మాధవన్ పాత్ర కోసం రవితేజను సంప్రదించగా.. ఆయన సుముఖతను వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘గోపాల గోపాల’ ఫేం డాలీ తెరకెక్కించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ రెడీ అవుతుండగా.. హరీష్ శంకర్ సినిమా తర్వాత ఈ మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశం ఉంది. కాగా, లాక్ డౌన్ తర్వాత ఈ మూవీపై అఫీషియల్ ప్రకటన వెలువడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..