60 క్రిమినల్ కేసులు….. కరడు గట్టిన నేరగాని కోసం గాలింపు..

| Edited By: Ravi Kiran

Jul 04, 2020 | 5:55 PM

యూపీలో కరడు గట్టిన క్రిమినల్ వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. కాన్పూర్ పరిధిలోని బిక్రు గ్రామంతో సహా చుట్టుప్రక్కల గ్రామాలన్నీ గాలిస్తున్నారు.

60 క్రిమినల్ కేసులు..... కరడు గట్టిన నేరగాని కోసం గాలింపు..
Follow us on

యూపీలో కరడు గట్టిన క్రిమినల్ వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. కాన్పూర్ పరిధిలోని బిక్రు గ్రామంతో సహా చుట్టుప్రక్కల గ్రామాలన్నీ గాలిస్తున్నారు. సినీ ఫక్కీలో ఇతగాడు తన రక్షణ కోసం, సంఘ విద్రోహ కార్యకలాపాల కోసం గూండాలను నియమించుకున్నాడని. పోలీసులు తనను అరెస్టు చేయడానికి వస్తే వారిని ఎదిరించడానికి ఈ గూండాలను పంపేవాడని తెలిసింది. ఇటీవలే ఎనిమిది మంది పోలీసులను హతమార్చడమే గాక, మరో ఏడుగురు ఇతని అనుచరుల కాల్పుల్లో గాయపడ్డారు. 1990 నుంచి వికాస్ దూబే క్రిమినల్ చరిత్ర ప్రారంభమయింది. హత్య, హత్యా యత్నాలు, కిడ్నాపింగ్, బలవంతపు వసూళ్లు.. ఇంకా ఇలా పలు నేరాలకు పాల్పడుతూ వచ్చాడట.. 2001 లో సంతోష్ అనే బీజేపీ నేతను వెంటబడి తరిమి పోలీసు స్టేషన్ లోనే కాల్చి చంపాడు. 2002 లో పోలీసులకు లొంగిపోయినా ఆ తరువాత నిర్దోషిగా బయటపడ్డాడు. రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్న వికాస్ దూబే.. తన గ్రామానికి పోలీసులు రాకుండా గ్రామ సరిహద్దుల్లోనే పెద్ద బండరాళ్లు, బుల్ డోజర్ వంటిని అడ్డంగా పెట్టేవాడని తెలిసింది. ఊరి ఇళ్ల పై కప్పుల పై  నుంచి ఇతని గూండాలు  కాల్పులు జరిపే వారట.. కొంతమంది పోలీసు అధికారులతో ఇతనికున్న సంబంధాలతో చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. ఇతనిపై సుమారు 60 క్రిమినల్ కేసులున్నాయి.