తల్లి అంత్యక్రియలకు వెళ్లకుండా డ్యూటీలోనే ఎస్సై..హ్యాట్సాప్

|

Apr 01, 2020 | 11:22 PM

విధి నిర్వహణ ముఖ్యమా….. తల్లి అంత్యక్రియలు ముఖ్యమా…….ఎటూ తేల్చుకోలేని పరిస్ధితి. ఒక వైపు జన్మనిచ్చిన తల్లి……. మరో వైపు దేశాన్ని కబలిస్తున్న కరోనా. ఇటువంటి పరిస్ధితుల్లో తన తల్లి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించారు విజ‌య‌వాడ‌లో ఎస్సైగా ప‌నిచేస్తోన్న‌ శాంతారామ్ .  చివరకి విధినిర్వహణ కోసం తల్లి అంత్యక్రియలకు దూరమయ్యారు. కన్న తల్లి చివరి చూపుకు నోచుకోలేదు… బెజవాడ గల్లీల్లో పహారా కాస్తు ప్రజలు కరోనా బారిన పడకుండా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా మహమ్మారి కోరలు చాచిన […]

తల్లి అంత్యక్రియలకు వెళ్లకుండా డ్యూటీలోనే ఎస్సై..హ్యాట్సాప్
Follow us on

విధి నిర్వహణ ముఖ్యమా….. తల్లి అంత్యక్రియలు ముఖ్యమా…….ఎటూ తేల్చుకోలేని పరిస్ధితి. ఒక వైపు జన్మనిచ్చిన తల్లి……. మరో వైపు దేశాన్ని కబలిస్తున్న కరోనా. ఇటువంటి పరిస్ధితుల్లో తన తల్లి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించారు విజ‌య‌వాడ‌లో ఎస్సైగా ప‌నిచేస్తోన్న‌ శాంతారామ్ .  చివరకి విధినిర్వహణ కోసం తల్లి అంత్యక్రియలకు దూరమయ్యారు. కన్న తల్లి చివరి చూపుకు నోచుకోలేదు… బెజవాడ గల్లీల్లో పహారా కాస్తు ప్రజలు కరోనా బారిన పడకుండా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా మహమ్మారి కోరలు చాచిన ఈ సమయంలో వందలాది కిలోమీటర్ల దూరం వెళ్ళి అంతిమ సంస్కారంలో పాల్గోనే కంటే ఇటువంటి విపత్కర సమయంలో తన విధులను సక్రమంగా నిర్వహిస్తేనే తన తల్లి ఆత్మ శాంతిస్తుందనే భావనలో ఆయన ఉన్నారు. అంత్యక్రియలకు వెళ్ళేందుకు అధికారులు అనుమతిచ్చినా అంత దూరం వెళ్ళి అంతిమ సంస్కారంలో పాల్గోన్న తర్వాత తిరిగి వచ్చిన ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో విధులకు దూరమై క్యారంటైన్లో ఉండాల్సి వస్తుందని తల్లి చివరి చూపు కన్నా అందరి మంచి గురించి ఆలోచించి చిత్తశుద్దిగా విధులు నిర్వర్తిస్తూ ఆ సబ్ ఇన్స్పెక్టర్ను అధికారులే కాదు అందరూ అభినందిస్తున్నారు.