
Vijayawada Kanakadurga Fly Over: బెజవాడకు మణిహారంగా పరిగణించబడుతున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రయాణికుల కోసం సిద్ధమయ్యింది. తాజాగా ఈ ఫ్లై ఓవర్ ప్రారంభ ముహూర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. సెప్టెంబర్ 4న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. భవానిపురం నుంచి దుర్గగుడి మీదుగా రాజీవ్ గాంధీ పార్కు వరకు నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి అధికారుల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అదే రోజున ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్‌కు సంబంధించిన రూ. 13 వేల కోట్ల పనులకు కూడా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇటీవల ఈ ఫ్లై ఓవర్ పై ట్రయిల్ రన్ కూడా నిర్వహించారు.
Also Read:
కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..