విజయవాడ గ్యాంగ్ వార్ లో కొత్త కోణం..!

విజయవాడ గ్యాంగ్ వార్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తోట సందీప్ ని హత్య చేసిన కేటిఎం పండు కి మధ్య పాత గొడవలు.

విజయవాడ గ్యాంగ్ వార్ లో కొత్త కోణం..!

Updated on: Jun 02, 2020 | 4:01 PM

విజయవాడ గ్యాంగ్ వార్ లో ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్ అనే వ్యక్తికి… హత్య చేసిన కేటిఎం పండు అనే వ్యక్తికి పాత గొడవలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ గొడవలో పండు… సందీప్ ని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
సందీప్ తో ఘర్ణణకు ముందు టికటాక్ వీడియో చేసిన పండు. సందీప్ గొంతు కోస్తుంటే సంతృప్తిగా ఉంటుందంటూ పండు చేసిన టిక్ టాక్ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ మారుతోంది. దీంతో పండును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వాళ్ళ ఇద్దరికీ ఫేస్ బుక్ లో సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో గ్రూపులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వీళ్ళను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళను పోలీసులు విచారించే అవకాశం ఉంది. దీని వెనుక రాజకీయ కోణం దాగి ఉందా అనే కోణ్ంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us