జగన్ ప్రమాణస్వీకారంలో అది స్పష్టంగా కనిపించింది: విజయసాయి రెడ్డి

| Edited By:

Jun 01, 2019 | 12:06 PM

దుబారా ఖర్చులకు కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి కట్టడి చేశారని, ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించిందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విజయ సాయి రెడ్డి.. ‘‘దుబారా ఖర్చులను సీఎం జగన్ గారు కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవిక. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం […]

జగన్ ప్రమాణస్వీకారంలో అది స్పష్టంగా కనిపించింది: విజయసాయి రెడ్డి
Follow us on

దుబారా ఖర్చులకు కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి కట్టడి చేశారని, ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించిందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విజయ సాయి రెడ్డి.. ‘‘దుబారా ఖర్చులను సీఎం జగన్ గారు కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవిక. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదు’’ అంటూ కామెంట్లు చేశారు.

ఇక పింఛన్లు పెంపుపై కూడా ఆయన స్పందించారు. ‘‘వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను భారీగా పెంచిన రాష్ట్రంగా ఏపీ దేశంలోనే చరిత్ర సృష్టించంది. కిడ్నీ బాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నవారంతా సిగ్గుపడాలి. నేను చూశాను. నేను ఉన్నాను అంటూ నెలకు పదివేల ఆసరా కల్పించారు యువ ముఖ్యమంత్రి’’ అంటూ ఆయన ప్రతిపక్షాలపై చురకలు విసిరారు.