రైతుల కోసం సేతుపతి ముందడుగు.. హ్యాట్సాఫ్ టు ‘మక్కల్ సెల్వన్’

రైతుల కోసం సేతుపతి ముందడుగు.. హ్యాట్సాఫ్ టు 'మక్కల్ సెల్వన్'

సినిమాలతో పాటు సామజిక సమస్యలపై స్పందించే విషయంలో కూడా ముందుంటారు తమిళ హీరోలు. ఎక్కడైనా, ఎవరికైనా కష్టం వస్తే చాలు.. మేమున్నాం అంటూ తోచిన సాయం చేస్తుంటారు. ‘జల్లుకట్టు’ నుంచి ‘హోర్డింగ్’ ఉదంతం వరకు అన్నింటిలోనూ కోలీవుడ్ హీరోలు తమ స్వరాన్ని వినిపించారు. ఇక రైతుల విషయానికి వస్తే.. ఇప్పటికే హీరో విశాల్ వారికి అండగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కూడా చేరిపోయారు. వరుస హిట్స్‌తో తమిళంలో […]

Ravi Kiran

|

Oct 19, 2019 | 2:18 PM

సినిమాలతో పాటు సామజిక సమస్యలపై స్పందించే విషయంలో కూడా ముందుంటారు తమిళ హీరోలు. ఎక్కడైనా, ఎవరికైనా కష్టం వస్తే చాలు.. మేమున్నాం అంటూ తోచిన సాయం చేస్తుంటారు. ‘జల్లుకట్టు’ నుంచి ‘హోర్డింగ్’ ఉదంతం వరకు అన్నింటిలోనూ కోలీవుడ్ హీరోలు తమ స్వరాన్ని వినిపించారు. ఇక రైతుల విషయానికి వస్తే.. ఇప్పటికే హీరో విశాల్ వారికి అండగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కూడా చేరిపోయారు.

వరుస హిట్స్‌తో తమిళంలో స్టార్ స్టేటస్ సంపాదించిన విజయ్ సేతుపతి.. ఎప్పుడూ ప్రజలకు సాయం చేస్తుంటారు. రీసెంట్‌గా బుల్లితెరపై ఓ టాక్ షో ప్రారంభించి.. అనేకమంది పేదవారికి అండగా నిలిచిన ఈ మక్కల్ సెల్వన్.. ఇప్పుడు రైతుల కోసం ఓ అడుగు ముందుకేశారు. ప్రస్తుతం విజయ్ ‘లాభం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. చక్కటి కథలతో సోషల్ మెసేజ్‌ను అందించే సీనియర్ డైరెక్టార్ ఎస్.ఫై.జననాదన్ ఈ మూవీకి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా చిత్రం షూటింగ్ నిమిత్తం రైతు భవనం అవసరమైంది.  సెట్ వేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తుండగా.. సెట్ వద్దు, రియల్ లొకేషన్‌లోనే చిత్రీకరణ జరుపుదామని.. అంతేకాక రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి, షూటింగ్ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే ఆ భవనాన్ని అప్పగించాలని చెప్పారట. సేతుపతి మంచి మనసుకు.. అటు చిత్ర యూనిట్.. ఇటు గ్రామ ప్రజలు ఇద్దరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. శృతి హాసన్, జగపతి బాబు, కలై అరసన్, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్  సంగీతం అందిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu