VIJAY SETHUPATHI EMOTIONAL MESSAGE : దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలకు డిమాండ్ పెరుగుతోంది. వెల్లూరుతో పాటు చెన్నై లోని పులాల్ జైలులో గత 28 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నారు ఏడుగురు నిందితులు.
అయితే నళిని , మురుగన్, శాంతన్ , పెరరివాలన్‌తో పాటు ఏడుగురిని విడుదల చేయాలని ఏడాది క్రితమే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించింది. ఇప్పటివరకు కూడా దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు పెరరివాలన్ తల్లి అర్పుద్ అమ్మాళ్. ప్రభుత్వం పంపించిన తీర్మానంపై ఎందుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు.
పలువురు ప్రముఖులు కూడా గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం హాష్‌టాగ్‌గా మారింది. నటుడు విజయ్‌సేతుపతి కూడా రాజీవ్ హత్య కేసులో నిందితులకు వెంటనే క్షమాభిక్ష ప్రకటించాలని కోరారు.
#ReleasePerarivalan pic.twitter.com/SVVVH8hPcM
— VIJAY SETHUPATHI FC ® (@VijaySethu_FC) November 20, 2020