ఏంటి ‘రౌడీ’.. అలియా కూడా అలా అందా.?

|

Dec 05, 2019 | 1:16 PM

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్ సంపాదించాడు హీరో విజయ్ దేవరకొండ. అటు యువతకు, ఇటు టాలీవుడ్ పెద్దలకు విజయ్ నిజంగా హీరో అయిపోయాడు. అంతేకాక విజయ్ స్టైల్, స్వాగ్‌కు అందరూ అతన్ని ముద్దుగా ‘రౌడీ’ అని పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్లను పక్క ఇండస్ట్రీ వాళ్ళు అసలు పట్టించుకోరన్న సంగతి తెలిసిందే. కానీ విజయ్‌ను మాత్రం అనేక సందర్భాల్లో పొరుగు ఇండస్ట్రీల నటీనటులు పొగిడిన సందర్భాలు కోకొల్లలు. […]

ఏంటి రౌడీ.. అలియా కూడా అలా అందా.?
Follow us on

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్ సంపాదించాడు హీరో విజయ్ దేవరకొండ. అటు యువతకు, ఇటు టాలీవుడ్ పెద్దలకు విజయ్ నిజంగా హీరో అయిపోయాడు. అంతేకాక విజయ్ స్టైల్, స్వాగ్‌కు అందరూ అతన్ని ముద్దుగా ‘రౌడీ’ అని పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్లను పక్క ఇండస్ట్రీ వాళ్ళు అసలు పట్టించుకోరన్న సంగతి తెలిసిందే. కానీ విజయ్‌ను మాత్రం అనేక సందర్భాల్లో పొరుగు ఇండస్ట్రీల నటీనటులు పొగిడిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్లకు ఇప్పుడు విజయ్ ఒక హార్ట్ థ్రోబ్.

గతంలో హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో విజయ్ పేరు ప్రస్తావించడం విశేషం. అలాగే ‘కబీర్ సింగ్’ హీరోయిన్ కియారా అద్వానీ కూడా పలుసార్లు విజయ్ నటనపై ప్రశంసలు కురిపించింది. ఇక తాజాగా ఇదే కోవలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా విజయ్ దేవరకొండను పొగడటం బీ-టౌన్‌లో ఇప్పుడు హాట్ టాపిక్.

ఈ ఏడాదిలో మోస్ట్ రొమాంటిక్ స్టార్ ఎవరని అలియాను అడగ్గా.. ఠక్కున విజయ్ దేవరకొండ అని మనసులోని మాటను చెప్పింది. బాలీవుడ్‌లో మ్యాన్లీ హీరోలు ఎందరో ఉన్నా.. అలియా భట్.. విజయ్ దేవరకొండ పేరు చెప్పడం కాస్త ఆశ్చర్యమేనని చెప్పాలి. ఇక హీరోయిన్ల విషయంలో రొమాంటిక్ స్టార్ అనుష్క శర్మ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా విజయ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చాలామందికి ఇప్పుడు తెలిసొచ్చింది.