Vijay Devarakonda: పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో హాజరైన విజయ్ దేవరకొండ.. వీడియో చూశారా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు సక్సెస్ అయినా, ప్లాఫ్ అయినా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఇక విజయ్ కూడా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు ఎంతో గౌరవం, మర్యాద ఇస్తాడు. వారు అడిగింది కాదనకుండా ఇస్తాడు
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు సక్సెస్ అయినా, ప్లాఫ్ అయినా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఇక విజయ్ కూడా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు ఎంతో గౌరవం, మర్యాద ఇస్తాడు. వారు ఏ సాయమైనా అడిగితే కాదనకుండా హెల్ప్ చేస్తాడు. అలాగే తన సిబ్బంది పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తుంటాడు. వారి కష్ట, సుఖాల్లోనూ పాలు పంచుకుంటుంటాడు. అలా తాజాగా తన పర్సనల్ గార్డ్ పెళ్లికి హాజరై సందడి చేశాడు విజయ్ దేవరకొండ. కొత్త దంపతులను ఆశీర్వదించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన విజయ్ను అక్కడి పెద్దలు ఘనంగా సన్మనించారు. అనంతరం కత్తిని బహూకరించారు. అలాగే రౌడీ హీరో కలిసి ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే. .ఖుషి తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవర కొండ. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. పరశు రామ్ పెట్ల దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైన ఫ్యామిలీ స్టార్ యావరేజ్ గా నిలిచింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుందీ మూవీ. త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనున్నాడు ఫ్యామిలీ స్టార్. దీని తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. VD12 (వర్కింగ్ టైటిల్ ) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇందులో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లిలో విజయ్ దేవర కొండ కుటుంబ సభ్యులు.. వీడియో ఇదిగో..
.@TheDeverakonda along with family at his personal guard #Ravi wedding.😍#VijayDeverakonda pic.twitter.com/V623CEe9v8
— Suresh PRO (@SureshPRO_) April 23, 2024
త్వరలోనే ఓటీటీలో సందడి చేయనున్న ఫ్యామిలీ స్టార్..
We are a happy Family ❤️ We will make you all super duper happy from April 5th. #FamilyStar pic.twitter.com/r7UwVynspk
— Vijay Deverakonda (@TheDeverakonda) April 2, 2024
#TheFamilyStar Streaming From MAY 3rd on Prime Video in Telugu and Tamil⭐💥
(Inbetween, there was a PLAN to stream it in RENT Model From APR 26th)#VijayDeveraKonda | #MrunalThakur | #GopiSundar | #ParasuramPetla 😎⭐🔥#TheFamilyStarOnPrime#FamilyStar#FamilyStarOnPrime pic.twitter.com/vvyf8ypqle
— OTT STREAM UPDATES (@newottupdates) April 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.