ఇంటిల్లిపాదితో ఇంట్లోనే ఆనందంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుని దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి ద్వారా బాలగంగాధర్ తిలక్ సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారని, అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో మట్టితో చేసిన సహజమైన వినాయకుని ప్రతిమలతో వినాయకచవితి పర్వదినం జరుపుకోవాలి. భక్తి ప్రపత్తులతో కుటుంబంతో కలిసి మార్గదర్శకాలను పాటిస్తూ ఇండ్లలోనే జరుపుకోవాలని సూచించారు.
‘ఆధ్యాత్మికత, ఆనందాల సమ్మిళితంగా పర్యావరణాన్ని పరిరక్షించే వేడుకగానే ఈ ఉత్సవాలను భావించాలని, ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని”పిలుపునిచ్చారు. ప్రకృతిని – సంస్కృతిని సమతుల్యం చేస్తూ సుసంపన్నమైన మానవాళి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని” వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
మట్టితో చేసిన సహజమైన వినాయకుని ప్రతిమలతో వినాయకచవితి పర్వదినాన్ని ఇంట్లోనే జరుపుకుందాం.
ఆధ్యాత్మికత, ఆనందాల సమ్మిళితంగా పర్యావరణాన్ని పరిరక్షించే వేడుకగానే ఈ ఉత్సవాలను భావించండి.
ప్రకృతిని, సంస్కృతిని సమతుల్యం చేస్తూ సుసంపన్నమైన మానవాళి భవిష్యత్తు దిశగా ముందుకు సాగుదాం. #Ganesha pic.twitter.com/3yBwhJBNn7— Vice President of India (@VPSecretariat) August 21, 2020