సినీఇండస్ట్రీలో మరోవిషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు రవి పట్వర్ధన్ కన్నుమూత
2020 సినిమా పరిశ్రమలో కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలాయి. ఓవైపు కరోనా సినీ ఇండస్ట్రీ పైన పెను ప్రభావం చూపితే ..మరోవైపు సినీ దిగ్గజాలు కన్నుమూయడం సినీపరిశ్రమను కుంగదీసింది.

2020 సినిమా పరిశ్రమలో కోలుకోలేని ఎదురుదెబ్బలు తగిలాయి. ఓవైపు కరోనా సినీ ఇండస్ట్రీ పైన పెనుప్రభావం చూపితే..మరోవైపు సినీ దిగ్గజాలు కన్నుమూయడం సినీపరిశ్రమను మరింత కుంగదీసింది. తాజాగా ఇండస్ట్రీలో మరోవిషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రవి పట్వర్ధన్(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్నరాత్రి సమయంలో మృతిచెందారు. శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న రవి పట్వర్ధన్ ను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూశారని ఆయన పెద్ద కుమారుడు నిరంజన్ పట్వర్ధన్ తెలిపారు. 250కి పైగా సినిమాలలో నటించిన పట్వర్ధన్ హిందీ, మరాఠీ భాషల్లో టీవీ సీరియల్స్‌లోనూ నటించారు.




