అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న జో బైడెన్ చైనాతో కయ్యానికి కాలుదువ్వుతారా? యుద్ధానికి సిద్ధమవుతారా? అంటే అవకాశాలైతే బాగానే ఉన్నాయని చైనా ప్రభుత్వ సలహాదారు అంటున్నారు.. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బైడెన్‌కు ఇంతకు మించిన ఆప్షన్ లేదని చెబుతున్నారు.. అమెరికా-చైనా మధ్య సత్సంబంధాలైతే లేవు.. డొనాల్డ్ ట్రంప్ కాలంలోనే రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ట్రంప్ వెళ్లిపోయి బైడెన్ వచ్చినా సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని తాము అనుకోవడం లేదని జెంగ్ యోంగ్నీయాన్ అన్నారు.. ఈయన షెన్‌జెన్‌కు చెందిన థింక్ ట్యాంక్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కాంటెంపరరీ చైనా స్టడీస్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు తాము సదా సిద్ధంగానే ఉంటామని చెప్పారు. రెండు దేశాల మధ్య ఇప్పుడు ఎలాంటి ఫ్రెండ్‌షిప్ లేదని, ప్రస్తుతం కోల్డ్‌వార్ జరుగుతోందని అన్నారు.. ఓవర్‌నైట్ సంబంధాలు మెరుగుపడతాయని తాము శించడం లేదని, అయితే అమెరికాతో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని తాము ఆశిస్తున్నామని అన్నారు.. ఇందుకోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం అమెరికా సమాజం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చడానికి బైడెన్ చైనా వ్యతిరేక చర్యలు తీసుకుంటారని జెంగ్ యోంగ్నీయాన్ అన్నారు.