Venezuela Government New Rules: చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం.. ఇద్దరు వద్దు.. ఒక్కరే ముద్దు అని కొన్ని దేశాల్లో పెరుగుతున్న జనాభాను నియంత్రణలో ఉంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే వనరులకూ, పెరుగుతున్న జనాభాకు సంబంధం లేకుండా పోతోందని ఆందోళనలను సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం తమకు జనాభా కావాలంటున్నాయి!
ఇదిలా ఉంటే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పలు చోట్ల వృద్ధుల సంఖ్య అధికంగా ఉంటే.. మరికొన్ని ప్లేస్‌ల్లో యువత సంఖ్య తక్కువగా ఉంటోంది. జనాభాలో సమతుల్యత లేకపోతే ఏ దేశ ప్రగతి అయినా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఇదే తరహా సమస్యను వెనిజులా దేశం ఎదుర్కుంటోందట.
ఇటీవల ఆర్ధిక సమస్యలతో వార్తల్లో నిలిచిన ఆ దేశం.. ఇప్పుడు మరోసారి సెన్సేషన్ అయింది. ఆ దేశ అధ్యక్షుడు పిల్లలను కనాలంటూ తన దేశ మహిళలకు పిలుపునిచ్చాడు. అదీ కూడా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఒక్కొక్కరు కనీసం 6 మంది పిల్లలను కనాలని ఆయన కోరుతున్నారు. దీని వల్ల దేశానికీ ఎంతో మేలు జరుగుతుందని.. అందుకే ప్రతీ మహిళా ఈ పని చేయాలని సూచించారు.
For More News:
కరోనా అలెర్ట్.. మాస్క్‌లతో జాగ్రత్త..
కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?
నేనే దేవుడ్ని.. కరోనా వచ్చింది నా వల్లే.. క్షమించండి..
జగన్ సర్కార్‌లో సంచైతకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?
హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు