ఆకాశానంటున్న కూరగాయల ధరలు…

|

Sep 06, 2020 | 6:37 PM

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాట, బీరకాయలు, క్యారెట్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. చాలా రకాల కూరగాయలు రిటైల్‌ మార్కెట్‌లో 80 రూపాయలపైనే పలుకుతోంది.

ఆకాశానంటున్న కూరగాయల ధరలు...
Follow us on

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాట, బీరకాయలు, క్యారెట్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. చాలా రకాల కూరగాయలు రిటైల్‌ మార్కెట్‌లో 80 రూపాయలపైనే పలుకుతోంది. కూరగాయలకు పెద్దగా డిమాండ్‌ లేకపోయినా, ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. దీనితో సామాన్యులు సతమతమవుతున్నారు. (Vegetable Prices Hike)

లాక్‌డౌన్‌ సమయంలోనూ కిలో 10 రూపాయలలోపే పలికిన టమాటా ప్రస్తుతం కిలో 50 నుంచి 60 రూపాయలకు చేరింది. సైజు కూడా బాగా చిన్నవి. వాటిలోనే కొద్దిగా పెద్దవి వేరు చేసి మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. నాణ్యత పెద్దగా లేకున్నా మార్కెట్‌లో మాత్రం భగ్గుమంటోంది. టమాటా అంతా మదనపల్లి మార్కెట్‌ నుంచే హైదరాబాద్‌కు వస్తుంది. అక్కడ ధర ఎలా ఉన్నా.. స్థానిక మార్కెట్లలో మాత్రం టమాటా ధర భారీగా పెరగుతోంది.

టమాటాతో పాటు వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ ధరలు కూడా రూ. 50 పైనే అమ్ముతున్నారు. ఉల్లిపాయ ధరలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అసలే కరోనా కష్టాలతో ముప్పు తిప్పలు పడుతున్న సామాన్యులకు వంటింటి కష్టాలు మరింత వణిికిస్తున్నాయి. పట్టణం వదిలి పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు ఇంతలా  పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.