నిద్రపోతే లక్ష జీతం.. అందరూ అర్హులే..

బెంగుళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే సంస్థ మాత్రం నిద్రపోతే చాలు రూ. లక్ష జీతం ఇస్తానంటోంది. ప్రతీ రోజూ 9 గంటల పాటు 100 రోజులు నిద్రపోతే రూ. లక్ష మీ సొంతం. ఇదే ఆ కంపెనీ ఇస్తున్న అదిరిపోయే ఆఫర్.

నిద్రపోతే లక్ష జీతం.. అందరూ అర్హులే..
Follow us

|

Updated on: Sep 04, 2020 | 5:12 PM

Sleep Internship: ఉద్యోగం ఏదైనా కూడా.. ఎంత కమిట్‌మెంట్‌తో కష్టపడి పని చేస్తే.. అంత గుర్తింపు.. జీతం పొందుతారు. అయితే పని చేసేటప్పుడు మాత్రం కాసింత కునుకు తీసినా పెద్ద నేరంగా పరిగణిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా బెంగుళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే సంస్థ మాత్రం నిద్రపోతే చాలు రూ. లక్ష జీతం ఇస్తానంటోంది. ప్రతీ రోజూ 9 గంటల పాటు 100 రోజులు నిద్రపోతే రూ. లక్ష మీ సొంతం. ఇదే ఆ కంపెనీ ఇస్తున్న అదిరిపోయే ఆఫర్.

బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్‌ అనే సంస్థ మ్యాట్రేస్ తయారు చేస్తుంది. వినియోగదారులకు కావాల్సిన రీతిలో పరుపులు తయారు చేసేందుకు స్లీప్ ప్యాట్రన్స్‌పై అధ్యయనం చేయడంలో భాగంగా 2019లో ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’ మొదలు పెట్టింది. దీనికి ఎంపికైన వారంతా తొమ్మిది గంటలు పడుకోవాలన్నది రూల్. అలా చేస్తే లక్షజీతం చెల్లిస్తారు.

ఈ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’కు ఎంపికైన వారు ఎక్కువసేపు నిద్రపోయేలా స్లీప్ ఎక్స్ పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియల్ డిజైన్లు, ఫిట్‌నెస్‌ నిపుణులు పలు సూచనలు చేస్తారు. ఇక 2021 ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’ కోసం ఆ కంపెనీ దరఖాస్తులు స్వీకరణ షురూ చేసింది. తమ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. కాగా, గతేడాది 1.7లక్షల మంది ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’కు దరఖాస్తు చేసుకోగా.. అందులో 23 మందిని ఎంపిక చేశారు. అందులో 21 మంది ఇండియన్స్.. ఇద్దరు విదేశీయులు. మరి ఈసారి ఈ ఉద్యోగానికి ఎంతమంది అప్లై చేస్తారో వేచి చూడాలి.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు