Valentines Day : బ్రేకప్‌కి ఓ మెడిసిన్..!
Valentines Day : అయినవాళ్లు చనిపోయారు. లైఫ్ లాంగ్ మనతోనే ఉంటారనుకున్న అమ్మాయి లేదా అబ్బాయి..మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తారు. పక్కా మరో స్థాయికి తీసుకెళ్తందున్న ఎగ్జామ్‌లో ఊహించని విధంగా ఫెయిల్ అవుతాం. ఇలా ప్రతి వ్యక్తిని కొన్ని చేదు జ్ఞాపకాలు జీవితమంతా వెంటాడతాయి. అయితే సందర్బానుసారం గుర్తుకురావడం వేరు. పదే, పదే అవి మనసును గుచ్చడం వేరు. దీన్ని వైద్య పరిబాషలో పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్‌డీ) అంటారు. దీనిపై కెనడాకు చెందిన బ్రూనెట్ అనే ఓ […]
Valentines Day : అయినవాళ్లు చనిపోయారు. లైఫ్ లాంగ్ మనతోనే ఉంటారనుకున్న అమ్మాయి లేదా అబ్బాయి..మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తారు. పక్కా మరో స్థాయికి తీసుకెళ్తందున్న ఎగ్జామ్‌లో ఊహించని విధంగా ఫెయిల్ అవుతాం. ఇలా ప్రతి వ్యక్తిని కొన్ని చేదు జ్ఞాపకాలు జీవితమంతా వెంటాడతాయి. అయితే సందర్బానుసారం గుర్తుకురావడం వేరు. పదే, పదే అవి మనసును గుచ్చడం వేరు. దీన్ని వైద్య పరిబాషలో పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్‌డీ) అంటారు. దీనిపై కెనడాకు చెందిన బ్రూనెట్ అనే ఓ సైకియాటిస్ట్ 15 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. ఫైనల్‌గా ఈ వెంటాడే బాధలకు ఆయన ‘రీకన్సాలిడేషన్ థెరపీ’ కనిపెట్టారు. హై బీపీ, మెగ్రెయిన్ లాంటి సమస్యలకు చాలా కాలంగా ప్రొప్రనొలోల్ అనే ఔషధాన్ని రిఫర్ చేస్తున్నారు డాక్టర్లు. ఇది మరికొన్ని రుగ్మతలకు కూడా విరుగడుగా పనిచేస్తుందట. ‘రీకన్సాలిడేషన్ థెరపీ’లో భాగంగా ముందుగా రోగికి ప్రొప్రనొలోల్‌ను ఇస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని తనను వెంటాడే బాధలను పేపర్‌పై రాసి…గట్టిగా చదివి వినిపించమని చెప్తారు. దీని ద్వారా ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న మానసిక బాధ ఏంటనేది డాక్టర్లు గుర్తిస్తారు.
ఇలా చేయడం వల్ల రోగి కొంత స్వాంతన ఫీల్ అవుతాడు. ఈ థెరపీని ఫాలో అవ్వడం వల్ల ఆ చేదు జ్ఞాపకాలు మనసును వదిలి వెళ్లిపోవు కానీ..నిరంతరం వేధించకుండా ఉంటాయి. మనిషి భావోద్వేగాలు మెదడులోని అమిగ్దల అనే ఏరియాలో స్టోర్ అయి ఉంటాయి. ఆ భావోద్వేగాలు నిక్షిప్తమై ఉన్న భాగాన్ని ఐడెంటిఫై చేసేందుకు ప్రొప్రనొలోల్ యూజ్ అవుతుంది. ఈ ఔషధం ఇచ్చిన రోగులు.. తమ తీవ్రమైన భావోద్వేగపూరిత మెమరీని రీకాల్ చేసి, దాని తీవ్రతను తగ్గించుకోని మళ్లీ ‘సేవ్’ చేసుకుంటారు. ఇలా చెయ్యడం ద్వారా ఆ భావోద్వేగ తీవ్రత చాలావరకు తగ్గిపోతుంది. ఇలా డాక్టర్ బ్రూనెట్ చేసిన పరిశోధనలో 70 శాతం మంది రోగులు ఉపశమనం పొందారట. ఆయన ఇప్పటివరకు ఫ్రాన్సులో 400 మందికి ఈ థెరపీని అందించారు. సర్‌ప్రైజింగ్‌గా అనిపించే విషయం ఏంటంటే.. లవ్ ఫెయిల్యూర్ అయిన చాలామంది వ్యక్తులు కూడా కేవలం ఒక్కసారి ఈ థెరపీ చేయించుకోవడం ద్వారా ఆ వేదన నుంది ఉపశమనం పొందారని ఆయన చెప్తున్నారు.