Valasa Releasing Boath: సరికొత్త విధానానికి నాంది పలికిన చిన్న సినిమా.. ఒకేసారి ఓటీటీ, థియేటర్లలో..
Valasa Movie Boath OTT And: లాక్‌డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ రంగం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది...
Valasa Movie Boath OTT And: లాక్‌డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ రంగం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేసే సరికొత్త పద్ధతికి బీజం పడింది లాక్‌డౌన్ సమయంలోనే. ప్రస్తుతం థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. మళ్లీ సినిమాలన్నీ థియేటర్ల బాటపడుతున్నాయి. తాజాగా ఓ చిన్న చిత్రం మరో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. సినిమాను ఒకేసారి ఓటీటీ వేదికలో, థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో వసల కులీలు పడ్డ కష్టాలను ఇతివృత్తంగా దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి ‘వలస’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని జనవరి 8న ఒకేసారి ఓటీటీ, థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో మనోజ్ నందం, తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్, గౌరీ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. మా చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా జనవరి 8వ తేదిన, అదే రోజున తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లోనూ విడుదల చేయనున్నామని తెలిపారు. ‘వలస’ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. నిజజీవితంలో ఉండే బతుకు పోరాటంలోని ఉద్వేగంతో పాటు సంతోషాలు, బాధలు ఇలా అన్ని కోణాలు సినిమాలో చూపించామన్నారు. Also Read: Hyderabad News : కూకట్‌పల్లిలో విషాదం.. కోతిని గద్దించేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి