Tdp Leader Subbaiah Murder Case: పొద్దుటూరు టీడీపీ నేత సుబ్బయ్య హత్య కేసులో ఐదుగురు అరెస్టు
Tdp Leader Subbaiah Murder Case: కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్య గురైన విషయంతెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు ఐదుగురిని...
Tdp Leader Subbaiah Murder Case: కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్య గురైన విషయంతెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. సుబ్బయ్య భార్య అపరాజిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ కేసును పారదర్శకంగానే దర్యాప్తు చేస్తున్నామని పొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.
కాగా, రెండు రోజుల కిందట పేదలకు పంపిణీ చేసే స్థలం వద్ద సుబ్బయ్యను దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. అయితే ఈ హత్యపై సుబ్బయ్య తల్లి, భార్య పలువురిపై ఆరోపణలు చేశారు. హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సుబ్బయ్య హత్యతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఐదుగురికి అరెస్టు చేశారు.
Also Read:
Actor Narsing Yadav Death : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత