AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Errabelli Dayakar Rao New Year Wishes : మానవాళిని వారి భవిష్యత్తు గురించి హెచ్చరించిన ఏడాది ఇది..

2020 ఓ పీడకలాంటిదని అన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. వరంగల్ ఉమ్మడి జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ..

Errabelli Dayakar Rao New Year Wishes : మానవాళిని వారి భవిష్యత్తు గురించి హెచ్చరించిన ఏడాది ఇది..
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2020 | 9:34 PM

Share

Errabelli Dayakar Rao New Year Wishes: 2020 ఓ పీడకలాంటిదని అన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. వరంగల్ ఉమ్మడి జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో ప్రజలు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.2020 మిగిల్చిన చెడు అనుభవాలు దృష్టిలో పెట్టుకొని, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరారు. “మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఏడాది ఇది . మానవాళిని వారి భవిష్యత్తు గురించి హెచ్చరించిన ఏడాది కూడా ఇదే. మహా ఉత్పాతాలు ఏర్పడినా.. వాటిని ఎదుర్కొనగలమనే భరోసా ప్రజలకు కల్పించిన ఏడాది కూడా ఇదే. యువతీయువకులు అన్ని సమస్యలను అధిగమించి తమ లక్ష్యాలను సాధించి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో భాగస్వాములు కావలి” అని ఎర్రబెల్లి దయాకర్‌ రావు కోరారు.