AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ts High Court Chief Justice Hima Kohli: తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన హిమా కోహ్లీ

Ts High Court Chief Justice Hima Kohli: తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా హిమా కోహ్లీని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ...

Ts High Court Chief Justice Hima Kohli: తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన హిమా కోహ్లీ
Telangana High Court
Subhash Goud
|

Updated on: Dec 31, 2020 | 9:57 PM

Share

Ts High Court Chief Justice Hima Kohli: తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా హిమా కోహ్లీని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె గురువారం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చౌహాన్‌ జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కాగా, తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ రికార్డు నియామకం అయ్యారు. కాగా, 1959 సెప్టెంబర్‌ 2న ఢిల్లీలో జన్మించిన జస్టిస్‌ హిమా కోహ్లీ.. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎ, ఎంఏ చేసిన అనంతరం న్యాయశాస్త్రం చదివార. 1984లో లా డిగ్రీ పొంది, అదే ఏడాది ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు.

అలాగే 2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 20 నుంచి ఢిల్లీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా , జూన్‌ 30 నుంచి నేషనల్‌ లా యూనివర్సిటీ వర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియామకమై బాధ్యతలు చేపట్టారు.

Also Read: Telangana New Secretariat Construction: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి