Hyderabad News : కూకట్‌పల్లిలో విషాదం.. కోతిని గద్దించేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం నెలకుంది. కోతిని గద్దించేందకు ప్రయత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మీడియా దృష్టికి వచ్చింది. 

Hyderabad News : కూకట్‌పల్లిలో విషాదం.. కోతిని గద్దించేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
Follow us

| Edited By: Balu

Updated on: Jan 01, 2021 | 5:39 PM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం నెలకుంది. కోతిని గద్దించేందకు ప్రయత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మీడియా దృష్టికి వచ్చింది. కూకట్‌పల్లి జయనగర్‌లో నివాసం ఉంటున్న లోకేశ్ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో..అతడు పనిచేస్తోన్న సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కల్పించింది.  అప్పట్నుంచే ఇంటి వద్ద నుంచే వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో.. మంగళవారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్ రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడం గమనించి…వాటిని తరిమేందుకు పక్కనే ఉన్న ఓ ఇనుప రాడ్‌ను వినియోగించాడు. ఈ క్రమంలో  ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.

లోకేశ్ చేతిలో ఉన్న ఇనుపరాడ్‌ ఊహించని విధంగా విద్యుత్ వైర్లకు తాకడంతో.. షాక్ కొట్టింది. ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే లోకేశ్‌ను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే లోకేశ్ తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జీవితంలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతోన్న తనయుడు కళ్లముందే కన్నుమూయడంతో అతని తల్లిదండ్రులు రోదన వర్ణణాతీతంగా మారింది. మృతునికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు.

Also Read : 

Crime News : దొంగతనం చేసి సినిమా స్టైల్లో కథ అల్లింది..స్క్రీన్ ప్లే అయితే చింపేసింది..పోలీసులు షాక్

Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…

Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !