16న 81 సెంటర్లలో వ్యాక్సినేషన్, అనంతరం మరిన్నికేంద్రాలు పెంచుతాం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , 4 రోజుల కార్యక్రమం !

| Edited By: Anil kumar poka

Jan 14, 2021 | 7:00 PM

ఈ నెల 16 న 81 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆ తరువాత దీన్ని 175 కేంద్రాలకు,

16న 81 సెంటర్లలో వ్యాక్సినేషన్, అనంతరం మరిన్నికేంద్రాలు పెంచుతాం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , 4 రోజుల కార్యక్రమం !
Follow us on

ఈ నెల 16 న 81 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆ తరువాత దీన్ని 175 కేంద్రాలకు, అనంతరం వెయ్యి సెంటర్లకు పెంచుతామన్నారు. కేంద్రం నుంచి తమకు ఇప్పటివరకు 2 లక్షల 74 వేల డోసుల వ్యాక్సిన్ అందిందని, సుమారు లక్షా 20 వేలమంది హెల్త్ వర్కర్లకు ఇది సరిపోతుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతి సెంటర్ లో 100 మందికి టీకామందు ఇస్తారని, వారంలో 4 రోజులు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఢిల్లీలో గురువారం 357 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసులు ఇప్పటివరకు 6,31, 249 కి చేరుకున్నాయి. అటు దేశవ్యాప్తంగా బ్రిటన్ స్ట్రెయిన్ కేసులకు సంబంధించి 109 మంది మృతి చెందినట్టు వార్తలు అందుతున్నాయి.

ఈ కేసుల నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. యూకే నుంచి దేశంలోని వివిధ విమానాశ్రయాలకు చేరుకుంటున్న ప్రయాణికులకు అన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇటీవల బెంగుళూరులోని  కెంపె గౌడ ఎయిర్ పోర్టులో దిగిన ప్రతి ప్రయాణికుని చేతి మీద యూకే అని సంబంధిత తేదీని కూడా స్టాంప్ వేసిన విషయం తెలిసిందే.

Read Also:‘పుష్ప’ కోసం విజయశాంతిని సంప్రదించారా.. రాములమ్మ వద్దనడానికి కారణం ఇదేనా..!