మరో ఇరాన్ కమాండర్ హత్యకు అమెరికా ప్లాన్ చేసిందా.?

|

Jan 12, 2020 | 2:17 PM

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వార్ టైప్ సిట్యువేషన్స్ మెల్లగా తగ్గు ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ సైన్యాధ్యక్షుడు సులేమాన్‌ను బాగ్దాద్‌లో జరిగిన డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలన విషయం బయటికి వచ్చింది. మరో ఇరాన్ కమాండర్‌ను కూడా అంతమొందించేందుకు అమెరికా పక్కాగా ప్లాన్ చేసిందని ఆ దేశ రక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు.   ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ)కు చెందిన కమాండర్ అబ్దుల్ […]

మరో ఇరాన్ కమాండర్ హత్యకు అమెరికా ప్లాన్ చేసిందా.?
Follow us on

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వార్ టైప్ సిట్యువేషన్స్ మెల్లగా తగ్గు ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ సైన్యాధ్యక్షుడు సులేమాన్‌ను బాగ్దాద్‌లో జరిగిన డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలన విషయం బయటికి వచ్చింది. మరో ఇరాన్ కమాండర్‌ను కూడా అంతమొందించేందుకు అమెరికా పక్కాగా ప్లాన్ చేసిందని ఆ దేశ రక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ)కు చెందిన కమాండర్ అబ్దుల్ రెజా షెహ్ లాయ్‌ను కూడా సులేమాన్‌ను చంపిన విధంగానే మట్టుబెట్టాలని అమెరికా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి కూడా ఉన్నట్లు రక్షణ అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఇద్దరూ చనిపోతే ఇరాన్ బలం పూర్తిగా తగ్గిపోతుందని అమెరికా ప్లాన్ చేసిందట. అయితే ఇరాన్ సైన్యాధ్యక్షుడి సులేమాన్‌ను చంపగలిగింది గానీ కమాండర్ అబ్దుల్ రెజాను టార్గెట్ చేయడంలో మాత్రం ఆ దేశం విఫలమైంది. ఇక ఎందుకు ఆ స్కెచ్ వర్కౌట్ కాలేదన్న దానిపై మాత్రం వారు ఏ విషయమూ బయటపెట్టలేదు. కాగా, అమెరికా ఇప్పటికే ఇరాన్ కమాండర్ అబ్దుల్ రెజాపై భారీ రివార్డ్ ప్రకటించిన సంగతి విదితమే. ప్రస్తుతం అతడు యెమెన్‌లో ఉంటూ అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడుతున్నాడు.