టిబెటన్ సమస్యల కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక సమన్వయకర్తను నియమించింది. బ్యూరో ఆఫ్ డెమోక్రసీ, మానవ హక్కుల అసిస్టెంట్ సెక్రటరీ హోదాను కలిగి ఉన్న రాబర్ట్ డెస్ట్రో, టిబెటన్ ఇష్యూస్ కోసం యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ కోఆర్డినేటర్ ఏకకాల హోదాను కలిగి ఉంటారని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైఖేల్ పోంపీయో ప్రకటించారు.
టిబెట్ పాలసీ చట్టం ప్రకారం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పిఆర్‌సి) దలైలామా తోసహా అతని ప్రతినిధుల మధ్య సంప్రదింపులను ప్రోత్సహించడానికి అమెరికా ప్రయత్నాలకు స్పెషల్ కోఆర్డినేటర్ డిస్ట్రో నాయకత్వం వహిస్తారని ప్రకటనలో తెలిపింది. సమన్వయకర్త టిబెటన్ల ప్రత్యేకమైన మత, సాంస్కృతిక, భాషా గుర్తింపును కూడా రక్షిస్తాడని, వారి మానవ హక్కులను రక్షణకు సహాకరిస్తారని పేర్కొన్నారు.
స్పెషల్ కోఆర్డినేటర్ రాబర్ట్ డెస్ట్రో టిబెటన్ శరణార్థుల మానవతా అవసరాలను తీర్చడానికి కృషీ చేస్తారన్నారు. పీఠభూమిలోని టిబెటన్ సమాజాలలో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు అమెరికా తరుపున ప్రయత్నిస్తారన్నారని పోంపియో తెలిపారు.