హెచ్-1 బీ వీసాలపై మళ్ళీ అమెరికా ‘కత్తి’ !

| Edited By: Pardhasaradhi Peri

Oct 22, 2020 | 6:52 PM

హెచ్-1 బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ ( ప్రత్యేక నైపుణ్య వృత్తులకు సంబంధించి)  తాత్కాలిక బిజినెస్ వీసాలను జారీ చేయరాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. ఈ టెంపోరరీ వీసాలను జారీ చేస్తే ఆయా కంపెనీలు తమ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ను యుఎస్ లో కొంతకాలంపాటు ఉండి విధులు నిర్వహించేందుకు వీలు కల్పిస్తున్నాయి.  ఈ ప్రతిపాదన ఖరారైన పక్షంలో వేలాది భారతీయ ప్రొఫెషనల్స్ కి గడ్డు పరిస్థితిని సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రపోజల్..’హెచ్’ పాలసీ బదులు  విదేశీ నిపుణులు […]

హెచ్-1 బీ వీసాలపై మళ్ళీ అమెరికా కత్తి !
Follow us on

హెచ్-1 బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ ( ప్రత్యేక నైపుణ్య వృత్తులకు సంబంధించి)  తాత్కాలిక బిజినెస్ వీసాలను జారీ చేయరాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. ఈ టెంపోరరీ వీసాలను జారీ చేస్తే ఆయా కంపెనీలు తమ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ను యుఎస్ లో కొంతకాలంపాటు ఉండి విధులు నిర్వహించేందుకు వీలు కల్పిస్తున్నాయి.  ఈ ప్రతిపాదన ఖరారైన పక్షంలో వేలాది భారతీయ ప్రొఫెషనల్స్ కి గడ్డు పరిస్థితిని సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రపోజల్..’హెచ్’ పాలసీ బదులు  విదేశీ నిపుణులు యుఎస్ లో ఎంటర్ కావడానికి  ‘బీ-1’ ప్రత్యామ్న్యాయంగా ఉంటుందన్న అపోహను పోగొడుతుందని అంటున్నారు. అమెరికన్ ఉద్యోగులను రక్షించేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నాన్-ఇమ్మి గ్రంట్ క్లాసిఫికేషన్ కు సంబందించినదే ‘హెచ్’ పాలసీ !

నవంబరు 3 న అధ్యక్ష ఎన్నికలు జరగడానికి రెండు వారాల ముందే ఈ ప్రతిపాదన చేశారు. ఇది భారతీయ కంపెనీల మీదా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సుమారు 500 మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు తమ కంపెనీ స్పాన్సర్ చేసిన బీ-1 వీసాలపై పని చేస్తున్నారని (హెచ్-1 బీ వీసాల బదులు) గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ కంపెనీపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ 8 లక్షల సెటిల్మెంట్లను ప్రకటించారు. ఇది గత ఏడాది డిసెంబరు నాటి మాట.