26 న భారత్ రానున్న అమెరికా మంత్రులు , చైనా ఆక్రమణే ప్రధాన అజెండా

| Edited By: Pardhasaradhi Peri

Oct 22, 2020 | 9:28 PM

అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో ఈ నెల 26 న ఇండియాను సందర్శించనున్నారు. వీరి రెండు రోజుల భారత పర్యటనలో ప్రభుత్వ నేతలతో జరిపే చర్చల్లో లడాఖ్ వద్ద చైనా ఆక్రమణే ప్రధాన అంశంగా ఉండనుందని తెలుస్తోంది. దీనితో బాటు భారత, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కూడా ప్రధాన కీలకాంశంగా ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. భారత్ తరఫున రక్షణ మంత్రి […]

26 న భారత్ రానున్న అమెరికా మంత్రులు , చైనా ఆక్రమణే ప్రధాన అజెండా
Follow us on

అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో ఈ నెల 26 న ఇండియాను సందర్శించనున్నారు. వీరి రెండు రోజుల భారత పర్యటనలో ప్రభుత్వ నేతలతో జరిపే చర్చల్లో లడాఖ్ వద్ద చైనా ఆక్రమణే ప్రధాన అంశంగా ఉండనుందని తెలుస్తోంది. దీనితో బాటు భారత, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కూడా ప్రధాన కీలకాంశంగా ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చర్చల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలతో బాటు దక్షిణా సియాలో శాంతి, సుస్థిరతల అంశంపై కూడా వీరు చర్చిస్తారని పేర్కొన్నారు. కాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రస్తావన కూడా వస్తుందని భావిస్తున్నారు.