AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రావెల్ హిస్టరీ లేకున్నా అమెరికా వాసిలో యూకే స్ట్రెయిన్ వైరస్, ఇదే ఫస్ట్ కేస్, ఇదెక్కడి వింత? నిపుణుల ఆశ్చర్యం

అమెరికాలోని కొలరాడోలో ఓవ్యక్తిలో బ్రిటన్ వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. ఆ వ్యక్తి బ్రిటన్ కు గానీ, ఇతర దేశాలకు గానీ వెళ్లకపోయినప్పటికీ ఇది ఎలా సంక్రమించిందో తెలియక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్రావెల్ హిస్టరీ లేకున్నా అమెరికా వాసిలో యూకే స్ట్రెయిన్ వైరస్, ఇదే ఫస్ట్ కేస్, ఇదెక్కడి వింత? నిపుణుల ఆశ్చర్యం
South African Covid-19 Variant
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 30, 2020 | 4:19 PM

Share

అమెరికాలోని కొలరాడోలో ఓవ్యక్తిలో బ్రిటన్ వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. ఆ వ్యక్తి బ్రిటన్ కు గానీ, ఇతర దేశాలకు గానీ వెళ్లకపోయినప్పటికీ ఇది ఎలా సంక్రమించిందో తెలియక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీమర్ 20 యేళ్ళున్న ఇతడు డెన్వర్ ఏరియాలోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే యూకే నుంచి ఈ వైరస్ ఇక్కడికి ఎలా చేరిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకు యూకే స్ట్రెయిన్ జాడ లేదు. కానీ అసలు ట్రావెల్ హిస్టరీయే లేని వ్యక్తికి  ఇది సోకింది. అంటే ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలుస్తోందని ట్రెవర్ బెడ్ ఫోర్డ్ అనే ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. వేరియంట్ కారణంగా మరో స్ప్రింగ్ వేవ్ తప్పదేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఎందుకైనా మంచిదని కొత్త స్ట్రెయిన్ సోకిన యువకుడిని ఆగ్నేయ డెన్వర్ లోని ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచి అతని ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా  గమనిస్తున్నారు.

ఇలా ఉండగా యూకెలో ఒక్క రోజులో 53,135 కొత్త కోవిడ్ కేసులను అధికారులు గుర్తించడం విశేషం. అయితే ఇవి ప్రాణాంతకమా , కాదా అన్నది ఇపుడే చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. సౌతాఫ్రికాలో 300 కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు చిలీలో మొదటి కేసును గుర్తించారు.