మోడెర్నా వ్యాక్సిన్: 100 మిలియన్ డోసులకు.. అమెరికా డీల్!

| Edited By:

Aug 12, 2020 | 1:21 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే నేపథ్యంలో అమెరికా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన

మోడెర్నా వ్యాక్సిన్: 100 మిలియన్ డోసులకు.. అమెరికా డీల్!
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే నేపథ్యంలో అమెరికా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న అమెరికా కంపెనీ మోడెర్నాతో ఈ ఒప్పందాన్నిచేసుకుంది. 100 మిలియన్ మోతాదుల కోవిడ్ -19 ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను తయారు చేసి పంపిణీ చేసేలా డీల్ కుదుర్చుకుంది.

కోవిద్-19 మహమ్మారి యూఎస్ లో కరాళనృత్యం చేస్తోంది. 23,82,600 యాక్టివ్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో మోడెర్నా వ్యాక్సిన్ 100 మిలియన్ల మోతాదుల తయారు, పంపిణీకి ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరిందని, టీకాకు అనుమతి లభించిన వెంటనే 100 మిలియన్ మోతాదులను వేగంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. మోడెర్నా ‘mRNA1273’ పేరుతో తీసుకొస్తున్న తమ వ్యాక్సిన్ చివరి దశ పరీక్షలను సెప్టెంబరులో పూర్తి చేయబోతున్నామని ఇటీవలే ప్రకటించింది.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!