AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో భారీవర్షాలు.. గుడిసె కూలి ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. భారీ వర్షాల ధాటికి పాత భవనాలు, పూరిగుడిసెలు కుప్పకూలుతున్నాయి. ఫతేపూర్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వర్షానికి గుడిసె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

యూపీలో భారీవర్షాలు.. గుడిసె కూలి ముగ్గురు చిన్నారులు మృతి
Balaraju Goud
|

Updated on: Aug 30, 2020 | 1:40 PM

Share

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. భారీ వర్షాల ధాటికి పాత భవనాలు, పూరిగుడిసెలు కుప్పకూలుతున్నాయి. ఫతేపూర్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వర్షానికి గుడిసె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఫతేపూర్‌ జిల్లా రత్వాఖేరా గ్రామానికి చెందిన సునీల్ పాల్ కుటుంబం గుడిసెలో జీవనం ఉంటోంది. శనివారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా గుడిసె పైకప్పు కూలడంతో సునీల్‌ పాల్‌ ముగ్గురు పిల్లలు శిశుపాల్ (2), సభజీత్ (5), గుధియా (15) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఆరుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానికుల సాయంతో బింద్కి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్లు పోలీస్‌ అధికారి సత్యేంద్ర సింగ్‌ తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు.

Follow Us
ముళ్లకంపపై పడుకుని పూజలు..గాల్లో గుండ్రంగా తిరిగే పూజారి!
ముళ్లకంపపై పడుకుని పూజలు..గాల్లో గుండ్రంగా తిరిగే పూజారి!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. దానం నాగేందర్ బిగ్ బాంబ్!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. దానం నాగేందర్ బిగ్ బాంబ్!
వందే భారత్ వర్సెస్ శతాబ్ది.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఇవే!
వందే భారత్ వర్సెస్ శతాబ్ది.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఇవే!
బస్సు దిగుతుండగా రోహిత్‌కు ఊహించని ప్రమాదం.. కోహ్లీ ఏం చేశాడంటే.?
బస్సు దిగుతుండగా రోహిత్‌కు ఊహించని ప్రమాదం.. కోహ్లీ ఏం చేశాడంటే.?
UPI రూ.6,000 చెల్లింపును.. రూ.2 చొప్పున 3 సార్లు చేస్తే ఏమవుద్దీ
UPI రూ.6,000 చెల్లింపును.. రూ.2 చొప్పున 3 సార్లు చేస్తే ఏమవుద్దీ
ఇరాన్‌ శాంతి ప్రణాళికను తిప్పి పంపిన ట్రంప్‌ హర్మూజ్‌ కాదు..
ఇరాన్‌ శాంతి ప్రణాళికను తిప్పి పంపిన ట్రంప్‌ హర్మూజ్‌ కాదు..
స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌?
స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌?
ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. కంటికి, గుండెకు దివ్యాస్త్రం..
ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. కంటికి, గుండెకు దివ్యాస్త్రం..
ఫుట్‌బ్రిడ్జ్‌పై స్కూటీ చూసి జనం షాక్.. కొత్త షార్ట్‌కట్..?
ఫుట్‌బ్రిడ్జ్‌పై స్కూటీ చూసి జనం షాక్.. కొత్త షార్ట్‌కట్..?
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్