సోషల్ మీడియా వేదికగా మరో పోలీసుల క్రౌర్యం వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన వ్యక్తిని చూసేందుకు నది ఒడ్డున నిలబడ్డ ఓ వ్యక్తిని ఓ పోలీసు అధికారి కాలితో తన్నడంతో గట్టుపై నుంచి నదిలో పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాపూర్ వింధ్యాచల్ లో జరిగింది.
మీర్జాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వింధ్యచల్ దివాన్ ఘాట్ లోని గంగా నది ఒడ్డు నుంచి ఒక యువకుడు ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోవడంతో జనం గుమిగూడారు. యువకుడి మృతదేహం కోసం గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఆపరేషన్ ను ఎస్ హెచ్ వో శశిధర్ పాండే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఆ ప్రాంతంలో సామాజిక దూరాన్ని పాటించకుండా జనం భారీగా గుమిగుడారు. దీంతో అగ్రహించిన పాండే ఓ వ్యక్తిని కాలి తన్నడంతో గంగా నదిలో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు సదరు పోలీసు అధికారిపై దుమ్మెత్తిపోశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పాండే నుంచి వ్యక్తిగత సంజాయిషి కోరుతూ నోటీసు జారీ చేశారు. జరిగిన ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించామని మీర్జాపూర్ పోలీసు సూపరింటెండెంట్ ధర్వీర్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరపాలని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ను కోరామని.. ఎస్‌హెచ్‌ఓకు వ్యక్తిగతం నోటీసు కూడా జారీ చేశామని ఎస్పీ తెలిపారు.
In a bizarre incident, an inspector kicked a man standing at the bank of Ganga river and watching a rescue operation in UP’s Mirzapur district. The man, on the edge, fell as he lost balance after the sudden kick in the leg by the cop. @Uppolice
Via @Mirzapuriy pic.twitter.com/DhrXqKq9CK
— Piyush Rai (@Benarasiyaa) July 29, 2020
మరోవైపు, మీర్జాపూర్ పోలీసు అధికారి పాండే తప్పులేదని, జనాన్ని అక్కడి నుంచి తరలించే క్రమంలో కాలు తగిలిందని వివరణ ఇచ్చుకున్నారు.