కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. అటు కంటైన్మెంట్ జోన్లలో కూడా ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. అటు సెప్టెంబర్ 21 నుంచి 9-12 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. ఇందుకు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. (Unlock4.0 Guidelines In Andhra Pradesh)
Also Read: సెప్టెంబర్ 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే స్పెషల్ ట్రైన్స్ ఇవే..