Breaking: అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు.. మెట్రో రైళ్లు స్టార్ట్.. స్కూళ్లు బంద్..

దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది.

Breaking: అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు.. మెట్రో రైళ్లు స్టార్ట్.. స్కూళ్లు బంద్..

Updated on: Aug 29, 2020 | 8:17 PM

Unlock 4.0 Guidelines: దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో కఠినతర లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా మెట్రో రైళ్లను సెప్టెంబర్ 7 నుంచి పునరుద్ధరణ చేయవచ్చునని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై యధావిధిగా సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు కొనసాగనున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే 50 శాతం బోధనా సిబ్బంది స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు (ఆన్‌లైన్ క్లాసుల కోసం) అనుమతిని ఇచ్చింది. అలాగే నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనా కోర్సులు, సాంకేతిక, వృత్తి సంబంధ కోర్సులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అటు సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అలాగే వచ్చే నెల 21 నుంచి క్రీడలు, రాజకీయ సమావేశాలకు పరిమితి  సంఖ్యతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక వందేమాతరం మిషన్‌లో భాగంగా హోంశాఖ అనుమతించిన విదేశీ విమాన సర్వీసులు మాత్రమే తిరుగుతాయని.. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది.