ఆన్‌లైన్‌ క్లాసులపై కేంద్రం కీలక నిర్ణయం..

|

Jul 08, 2020 | 12:36 PM

ఈ నెల 31 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని చెప్పిన కేంద్రం.. ఆన్‌లైన్‌, దూరవిద్యా తరగతులను మాత్రం కొనసాగించుకోవచ్చునని తెలిపింది. బోధన, బోధనేతర సిబ్బంది ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలంది.

ఆన్‌లైన్‌ క్లాసులపై కేంద్రం కీలక నిర్ణయం..
Follow us on

Online Classes: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్‌ జోన్లు, బఫర్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే వీటి వెలుపల ప్రదేశాల్లో మాత్రం సడలింపులు ఇస్తూ కేంద్రం అన్‌లాక్‌ ప్రక్రియను షూరూ చేసింది. ఇందులో భాగంగానే అన్‌లాక్‌ 2 మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసిన కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

ఈ నెల 31 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని చెప్పిన కేంద్రం.. ఆన్‌లైన్‌, దూరవిద్యా తరగతులను మాత్రం కొనసాగించుకోవచ్చునని తెలిపింది. బోధన, బోధనేతర సిబ్బంది ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలంది. కాగా, చిత్ర పరిశ్రమకు కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

Also Read:

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు..

ఏపీ ఎంసెట్.. విద్యార్ధులకు చివరి అవకాశం… నేడే ఆఖరు తేదీ..