Unique Idea-Viral Photo: పరిస్థితులకు అనుగుణంగా మనిషి తనని తాను మలుచుకుంటాడు. తనలోని ఆలోచనలకు పదును పెట్టి..తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటాడు. ఇంకా చెప్పాలంటే.. పరిస్థితులు మనిషి తన లోని టాలెంట్ కు పదుని పెట్టి.. సరికొత్త ఐడియాతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటాడు. దీనికి చదువు, ఆస్తులతో సంబంధం లేదు. అలాంటి అద్భుతాలను సృష్టించి వార్తల్లో నిత్యం నిలుస్తున్న వ్యక్తుల గురించి.. వారి యునిక్ ఐడియాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయినవారు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఇంటినీ నెటిజన్లను అంతగా ఆకర్షించిన ఐడియా ఏమిటో తెలుసా..
ప్రస్తుతం ఏపీతో పాటు, తమిళనాడులో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పేరు , ప్రాంతం తెలియని రోడ్డు మీద వరద నీరు పొంగి పొర్లుతుంది. అయితే అలాంటి వరద నీటిలో నడవాలంటే.. ఎవరికైనా ఇబ్బందే.. కొంతమంది మెడవరకు కూడా నీట మునిగి పోయి.. ఆ వరదలను ఈదుకుంటూ వెళ్లారు. అయితే ఓ వ్యక్తి ఆ వరద నీటిలో దిగకుండా ఆ వరద నీటిలో నడవడం కోసం రెండు ప్లాస్టిక్ కుర్చీలకు చెప్పులను కట్టాడు. ఆ ప్లాస్టిక్ కుర్చీలతో కాళ్లు కూడా తడవకుండా ఓ వ్యక్తి వరద నీటిలో హాయిగా నడుచుకుంటూ వెళ్లాడు. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో .. నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. వాట్ ఆన్ ఐడియా సర్ జీ అంటూ ఓ రేంజ్ లో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
— People With 1000 IQ (@PeopleWith1000i) November 26, 2021