రాజ్యసభ అధికారపక్ష నేతగా థావర్‌ చంద్‌ గెహ్లాట్‌

| Edited By:

Jun 12, 2019 | 9:26 AM

రాజ్యసభలో అధికార పక్ష నేతగా కేంద్రమంత్రి తావర్‌చంద్‌ గెహ్లాట్‌ మంగళవారం నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఈ బాధ్యతలను బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ నిర్వర్తించారు. అనారోగ్య కారణాలతో ఆయన ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థావర్‌ చంద్‌ గెహ్లాట్ 2014 నుంచి మోదీ కేబినెట్‌లో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం సామాజిక న్యాయం, సాధికారత శాఖను పర్యవేక్షిస్తున్నారు. థావర్ చంద్‌ గెహ్లాట్‌1996 నుంచి […]

రాజ్యసభ అధికారపక్ష నేతగా థావర్‌ చంద్‌ గెహ్లాట్‌
Follow us on

రాజ్యసభలో అధికార పక్ష నేతగా కేంద్రమంత్రి తావర్‌చంద్‌ గెహ్లాట్‌ మంగళవారం నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఈ బాధ్యతలను బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ నిర్వర్తించారు. అనారోగ్య కారణాలతో ఆయన ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థావర్‌ చంద్‌ గెహ్లాట్ 2014 నుంచి మోదీ కేబినెట్‌లో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం సామాజిక న్యాయం, సాధికారత శాఖను పర్యవేక్షిస్తున్నారు. థావర్ చంద్‌ గెహ్లాట్‌1996 నుంచి 2009 వరకు షాజాపూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2012, 2018లో ఎగువసభకు ఎన్నికయ్యారు.