క్వారంటైన్ కు కొన్ని మినహాయింపులు ఉన్నాయంటున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ..!

|

May 25, 2020 | 4:55 PM

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తుంటే.. కొవిడ్-19 నిబంధనలను ప్రతిఒక్కరూ.. ఖచ్చితంగా పాటించాలంటూ కేంద్రం చెబుతోంది. అయితే నేను మంత్రిని నాకు రూల్స్ ఏంటీ అంటూ దులుపేసుకుంటూ పోయాడు కేంద్రమంత్రి సదానందగౌడ్. కేంద్ర మంత్రి స‌దానంద గౌడ సోమవారం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో వ‌చ్చారు. అయితే ఆయ‌న హోట‌ల్ క్వారెంటైన్‌కు వెళ్ల‌లేదు. క్వారెంటైన్ నిబంధ‌న‌లు అంద‌రికీ ఒక్క‌టే అని, కానీ కొంత మందికి మిన‌హాయింపులు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఓ మంత్రి, ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని […]

క్వారంటైన్ కు కొన్ని మినహాయింపులు ఉన్నాయంటున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ..!
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తుంటే.. కొవిడ్-19 నిబంధనలను ప్రతిఒక్కరూ.. ఖచ్చితంగా పాటించాలంటూ కేంద్రం చెబుతోంది. అయితే నేను మంత్రిని నాకు రూల్స్ ఏంటీ అంటూ దులుపేసుకుంటూ పోయాడు కేంద్రమంత్రి సదానందగౌడ్.
కేంద్ర మంత్రి స‌దానంద గౌడ సోమవారం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో వ‌చ్చారు. అయితే ఆయ‌న హోట‌ల్ క్వారెంటైన్‌కు వెళ్ల‌లేదు. క్వారెంటైన్ నిబంధ‌న‌లు అంద‌రికీ ఒక్క‌టే అని, కానీ కొంత మందికి మిన‌హాయింపులు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఓ మంత్రి, ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయన్నారు మంత్రి సదానందగౌడ. పైగా త‌న ఫోన్‌లో ఆరోగ్య‌సేతు యాప్ ఉన్న‌ట్లు తెలిపారు. ఫార్మ‌సీ శాఖ‌కు తానే మంత్రినని, ఒక‌వేళ మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌కుంటే, కేసులు రెట్టింపు అవుతాయ‌ని అక్కడున్న వైద్య సిబ్బందికి వెల్లడించారు. దేశ‌మంతా మందులు స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌న్న‌ది త‌న బాధ్య‌త అన్నారు మంత్రి. అయితే, డాక్ట‌ర్లు కూడా క్వారెంటైన్ అయితే, మందులు స‌ర‌ఫ‌రా చేసేవాళ్లే క్వారెంటైన్ అయితే, క‌రోనా వైర‌స్‌ను ఎవ‌రు ఎదుర్కొంటార‌ని మంత్రి ప్రశ్నించారు. దేశీయ విమానాల్లో క‌ర్నాట‌క వ‌స్తున్న‌వారికి ఏడు రోజులు హోట‌ల్ క్వారెంటైన్ త‌ప్ప‌నిస‌రి చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఆ త‌ర్వాత ఏడు రోజుల ఇంట్లో క్వారెంటైన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. కానీ, ఈ నియ‌మం నుంచి కొంద‌రికి మిన‌హాయింపులు ఉన్నాయంటున్నారు అధికారులు.