ఆరోగ్యసేతులో గ్రీన్ స్టేటస్ ఉందా.. క్వారంటైన్ అవసరం లేదట..!
దేశీయ విమాన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు లేనివారికి క్వారంటైన్ అవసరం లేదని స్పష్టత నిచ్చింది కేంద్రం. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే ఆరోగ్యసేతు యాప్ అత్పనిసరి అని విమానయాన శాఖ పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి వెల్లడించారు. విమానయానం చేసే ప్రతిఒక్కరు ఆరోగ్యసేతు యాప్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు. ఆరోగ్య సేతు […]

దేశీయ విమాన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు లేనివారికి క్వారంటైన్ అవసరం లేదని స్పష్టత నిచ్చింది కేంద్రం. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే ఆరోగ్యసేతు యాప్ అత్పనిసరి అని విమానయాన శాఖ పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి వెల్లడించారు. విమానయానం చేసే ప్రతిఒక్కరు ఆరోగ్యసేతు యాప్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు. ఆరోగ్య సేతు యాప్ పాస్‌పోర్టు లాంటిందని చెప్పారు. ఆర్యోగ సేతు యాప్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవన్న ఆయన.. త్వరలో అంతర్జాతీయ విమానాల సంఖ్యను పెంచుతామని స్పష్టం చేశారు. విమానయానానికి సంబంధించి ఆయన ఈ రోజు ఫేస్‌బుల్ లైవ్‌లో పలువురి సందేహాలకు సమాధానాలిచ్చిన మంత్రి. విదేశాల నుంచి వచ్చేవారు మాత్రం తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించి నేటితో 60 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం దేశంలో నాలుగో విడత లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రయాణికలు రాకపోకలపై కేంద్ర కాస్త సడలింపులు ఇవ్వడంతో.. నింబంధనలు పాటిస్తూ విమానయాన సంస్థలు మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.