Economic Survey 2020-21 : బడ్జెజ్ సమావేశాల్లో భాగంగా 2020-21 ఆర్థిక సర్వేను శుక్రవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తూ ప్రతిపక్ష పార్టీలు నేటి సమావేశానికి హాజరుకాలేదు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేశారు.
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ.. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. శనివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.
Union Finance Minister Nirmala Sitharaman tabled Economic Survey 2020-21 in Lok Sabha; Real growth rate for FY21 is taken as -7.7% (MoSPI) and real growth rate for FY22 is assumed as 11.5 % based on IMF estimates. (Photo source: DD News) pic.twitter.com/Y4lPYyBCa2
— ANI (@ANI) January 29, 2021