నెల్లూరు జిల్లాపై నివార్ ప్రభావం.. ఎడతెరిపిలేని వర్షం.. యాభై అడుగుల మేర ముందుకొచ్చిన సముద్రం

|

Nov 26, 2020 | 10:38 AM

తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

నెల్లూరు జిల్లాపై నివార్ ప్రభావం.. ఎడతెరిపిలేని వర్షం.. యాభై అడుగుల మేర ముందుకొచ్చిన సముద్రం
Follow us on

Uninterrupted Rains : తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఆత్మకూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు.

ప్రమాద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. మంత్రి అనిల్ కుమార్, కలెక్టర్ చక్రధర్ బాబు వర్షాభావ పరిస్థితులను ఎప్పటకప్పుడు పర్యవేక్షిస్తున్నారు.విద్యా సంస్థలకి సోమవారం వరకు సెలవులు ప్రకటించారు.

వర్షాలకు జిల్లాలోని జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. సముద్రంలో అలల ఉధృతి కొనసాగుతోంది. ఇరవై నుంచి యాభై అడుగుల మేర సముద్రం ముంకు దూసుకొచ్చింది.