డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మకు ఊహించని షాక్.. హైకోర్టు నుంచి షోకాజ్ నోటీసులు..

|

Nov 24, 2020 | 4:06 PM

వివాదాస్పద సినిమాలు నిర్మిస్తూ నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా హైకోర్టు నుంచి షోకాజు నోటీసులు అందాయి. దిశ ఎన్‌కౌంటర్ సినిమాను నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం వల్ల సినిమాపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మకు ఊహించని షాక్.. హైకోర్టు నుంచి షోకాజ్ నోటీసులు..
Follow us on

వివాదాస్పద సినిమాలు నిర్మిస్తూ నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా హైకోర్టు నుంచి షోకాజు నోటీసులు అందాయి. దిశ ఎన్‌కౌంటర్ సినిమాను నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం వల్ల సినిమాపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌కౌంటర్ పేరుతో ఇప్పటికే వారి కుటుంబాలు నలిగిపోయాయని, ఈ సినిమా తీయడం వల్ల వారు ఊర్లో కూడా ఉండలేరని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వెంటనే చిత్రాన్ని నిలిపివేసేలా స్టే ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా దిశ ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. స్పందించిన హై కోర్టు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ కార్యాలయం హైదరాబాద్, దర్శకుడు వర్మ, యూనియన్ ఆప్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. అనంతరం రెండు వారాలకు విచారణను వాయిదా వేసింది. అయితే దిశ ఎన్‌కౌంటర్ సినిమా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో రిలీజై హల్‌చల్ చేస్తోంది. మరోవైపు ఈ నెల 26న సినిమా విడుదలచేయడానికి వర్మ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.