
బెంగుళూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యశ్వంత్‌పూర్లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా… నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలడంతో శిథిలాల కింద ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ఘటనా స్థలాన్ని సందర్శించారు రెవెన్యూ అధికారులు. బిల్డింగ్ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.