Viral: 70 ఏళ్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును తోలుతున్న యూకే పెద్దమనిషి!

|

Jan 31, 2022 | 7:27 AM

సాధారణంగా టూవీలర్ లేదా ఫోర్ వీలర్ వెహికల్లో వెళ్తుంటే రోడ్డుపై అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపి లైసెన్స్ వగైరా పత్రాలు అడగటం పరిపాటే. ఐతే తాజాగా ఓ వ్యక్తి కారులో వెళ్తుంటే మామూలుగానే పోలీసులు ఆపారు. లైసెన్స్ చూపించమని అడిగిన పోలీసులకు, మైండ్ బ్లాంక్ అయ్యే సమాధాన..

Viral: 70 ఏళ్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును తోలుతున్న యూకే పెద్దమనిషి!
Driving Licence
Follow us on

సాధారణంగా టూవీలర్ లేదా ఫోర్ వీలర్ వెహికల్లో వెళ్తుంటే రోడ్డుపై అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపి లైసెన్స్ వగైరా పత్రాలు అడగటం పరిపాటే. ఐతే తాజాగా ఓ వ్యక్తి కారులో వెళ్తుంటే మామూలుగానే పోలీసులు ఆపారు. లైసెన్స్ చూపించమని అడిగిన పోలీసులకు, మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానమిచ్చాడా కారు డ్రైవర్. 70 సంవత్సరాలకు పైగా లైసెన్స్ లేకుండా కారు డ్రైవింగ్ చేస్తున్నానని, అసలింతవరకు ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదని సదరు పెద్దమనిషి చెప్పడంలో పోలీసులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఈ సంఘటన ఏదో మారుమూల పల్లెటూరిలో జరిగుంటుందిలే అని అని కొట్టిపారేయకండి. అక్షరాలా యూకేలో జరిగిన సంఘటన ఇది. పూర్తివివరాల్లోకెళ్తే..

ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌లోని బుల్‌వెల్‌లో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసధికారులు టెస్కో ఎక్స్‌ట్రా సమీపంలో ఓ కారును ఆపారు. కారులోని డ్రైవర్‌ను లైసెన్స్ చూపించమని అడుగగా..1938లో కారు డ్రైవర్ పుట్టాడని, 12 ఏళ్ల వయసు నుంచి లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులకు చెప్పాడట. పైగా తనను ఎప్పుడూ పోలీసులు అడ్డుకోలేదని, అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదని కారు డ్రైవర్‌ చెప్పుకొచ్చాడు. అంతా విన్న పోలీసులు ఆశ్చర్యంతో తలమునకలైపోయారు. ఇన్నేళ్లు పోలీసుల కంటపడకుండా ఎలా మ్యానేజ్ చేయగలిగాడోనని సందేహం వ్యక్తం చేశారు. నాటింగ్‌హామ్‌లోని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) ద్వారా కెమేరాలకు చిక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇక మీదటనైనా కారుకు సంబంధించిన అన్నిడాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటే మంచిది. లేకుంటే ఏదో ఒక రోజు మా చేతికి దొరుకుతావని.. అతనికి చెప్పి పంపించారా పోలీసులు. ఈ మొత్తం సంఘటనను అక్కడి పోలీసధికారి ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో తాజాగా వెలుగులోకొచ్చింది.

Also Read:

Viral Video: బుద్ధుందా! లైకుల కోసం ఇంతటి నీచానికి ఒడికడతావా? పసిపిల్లాడితోనా ఆటలు..