Viral Video: చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగొచ్చాడు.. జస్ట్ మిస్ నుజ్జునుజ్జయ్యేవాడు.. షాకింగ్ వీడియో!
భూమి మీద నూకలు మిగిలి ఉంటే మనం చావుకు ఎదురెళ్లినా.. అది వెనకడుగు వేస్తుందటారు. బహుశా.! ఈ వీడియో చూస్తే మీరూ...
భూమి మీద నూకలు మిగిలి ఉంటే మనం చావుకు ఎదురెళ్లినా.. అది వెనకడుగు వేస్తుందటారు. బహుశా.! ఈ వీడియో చూస్తే మీరూ నిజమేనని ఒప్పుకుంటారు. సాధారణంగా వర్షాకాలంలో బైకులు నడిపేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో రోడ్లన్నీ కూడా వర్షపు నీరుతో చిత్తడి చిత్తడిగా మారడం వల్ల బండి టైర్లకు పట్టులేని కారణంగా వాహనాలు అదుపు తప్పవచ్చు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా మలేషియాలో చోటు చేసుకుంది. లక్ కలిసి రావడంతో ఆ బైకర్ వెంట్రుక వాసిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
22 సెకన్ల నిడివి ఉన్న ఈ వైరల్ వీడియో.. వర్షంతో రోడ్డంతా తడిసిపోయి తేమగా ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఇక ఆ రోడ్డుపై వేగంగా ఓ బైకర్ దూసుకొచ్చాడు. రోడ్డు చిత్తడిగా మారడంతో ఆ వాహనం అదుపు తప్పుతుంది. బైకర్ జారిపడతాడు. అంతలోనే ఆ వెనుక ఓ ట్రక్ దూసుకొస్తుంది. దాన్ని గమనించిన బైకర్ వెంటనే తేరుకుని క్షణాల వ్యవధిలో ట్రక్‌ను తప్పించుకుని పక్కకి పరుగు తీస్తాడు. ఈ ఘటన జనవరి 24న చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
Also Read:
వామ్మో! ఇదెక్కడి ధైర్యం రా బాబూ.. 14 అడుగుల కింగ్ కోబ్రాను సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు..
వరల్డ్ బెస్ట్ బౌలర్.. 16 ఏళ్ల కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు.. ఎవరో తెలుసా.?
తగ్గేదేలే.! ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీరే తోపు.! ట్రై చేయండి..