AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! ఇదెక్కడి ధైర్యం రా బాబూ.. 14 అడుగుల కింగ్ కోబ్రాను సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు..

సాధారణంగా పాములను చూస్తే మన వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది భారీ కింగ్ కోబ్రాను దగ్గర నుంచి చూస్తే ఇంకేమైనా ఉందా.?

Viral Video: వామ్మో! ఇదెక్కడి ధైర్యం రా బాబూ.. 14 అడుగుల కింగ్ కోబ్రాను సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు..
Snake
Ravi Kiran
|

Updated on: Jan 28, 2022 | 9:28 PM

Share

సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలలా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమైపోతోంది. సాధారణంగా పాములను చూస్తే మన వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది భారీ కింగ్ కోబ్రాను దగ్గర నుంచి చూస్తే ఇంకేమైనా ఉందా.? అంతే సంగతులు పైప్రాణం పైనుంచే పోతుంది. అంతటి డేంజరస్ అయిన కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పార్క్ లాంటి ప్రదేశంలో సంచరిస్తున్న సుమారు 14 అడుగులు పొడవున్న భారీ కొండచిలువను చాకచక్యంగా క్షణాల్లో ఒట్టి చేతులతో పట్టేసుకుని స్థానికులను ఆశ్చర్యపరిచాడు. దాన్ని పట్టుకునే క్రమంలో కింగ్ కోబ్రా తల పైకెత్తి కాటు వేసేందుకు ముందుకు వచ్చినా.. ఆ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాడు. ఈ ఘటన దక్షిణ థాయ్ ప్రావిన్స్ కాబ్రీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. ఇప్పటిదాకా ఇది 6900 వ్యూస్, 116 లైక్స్ రాబట్టుకుంది. ఇదిలా ఉంటే.. కింగ్ కోబ్రా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము. దాదాపు 10 నుంచి 13 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో తరచుగా కనిపిస్తుంటాయి.

Follow Us
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!