ఆ బీరుకు… రూ.73 లక్షల బిల్లు!
ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో సెప్టెంబరు 5న ఓ జర్నలిస్టుకు ఈ అనుభవం ఎదురైంది. బాధితుడు ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేయడంతో ఇది వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రీడా జర్నలిస్టు పీటర్ లేలర్.. మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్ అనే హోటల్‌కు వెళ్లారు. ఒక బీరు ఆర్డరిచ్చారు. తనకు అమెరికాకు చెందిన బ్రాండ్లు వద్దని చెప్పడంతో బ్రిటన్‌కు చెందిన బ్రాండ్ డ్యూచర్స్ ఐపీఏను సర్వ్ చేశారు. బీరు తాగడం ముగిశాక బిల్లు చెల్లింపు కోసం పీటర్ తన కార్డు ఇచ్చాడు. ఉద్యోగిని […]

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో సెప్టెంబరు 5న ఓ జర్నలిస్టుకు ఈ అనుభవం ఎదురైంది. బాధితుడు ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేయడంతో ఇది వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రీడా జర్నలిస్టు పీటర్ లేలర్.. మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్ అనే హోటల్‌కు వెళ్లారు. ఒక బీరు ఆర్డరిచ్చారు. తనకు అమెరికాకు చెందిన బ్రాండ్లు వద్దని చెప్పడంతో బ్రిటన్‌కు చెందిన బ్రాండ్ డ్యూచర్స్ ఐపీఏను సర్వ్ చేశారు. బీరు తాగడం ముగిశాక బిల్లు చెల్లింపు కోసం పీటర్ తన కార్డు ఇచ్చాడు. ఉద్యోగిని బిల్లు చెల్లింపు కోసం స్వైప్ చేసుకొని కార్డు తిరిగివ్వబోతూ ఉండగా.. బీరు ఖరీదెంతయింది? అని పీటర్ అడిగాడు. క్షణంలో ఆమె కంగారు పడిపోయి, వెంటనే మేనేజర్ వద్దకు పరుగెత్తింది.
అసలు విషయం ఏంటంటే.. బీరు తాగాక బిల్లు చెల్లింపు సమయంలో సదరు ఉద్యోగిని 99,983.64 డాలర్లు (రూ.73,70,226) అని టైప్ చేయడంతో ఆ సొమ్ము పీటర్ ఖాతా నుంచి హోటల్ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీనిపై స్పందించిన మేనేజర్ పీటర్‌కు సొమ్ము మొత్తాన్ని రీఫండ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ తప్పు జరిగినందుకు పీటర్‌కు క్షమాపణలు తెలిపారు. సంబంధిత బ్యాంకును సంప్రదించి, సొమ్ము మొత్తం రీఫండ్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
స్వైపింగ్ యంత్రంలో లోపాల వల్ల ఈ పొరపాటు జరిగి ఉండొచ్చని, ఈ ఘటనపై విచారణ జరుగుతోందని హోటల్ వర్గాలు తెలిపాయి. గత జులైలో నటుడు రాహుల్ బోస్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లోని మారియట్ హోటల్‌లో బస చేసిన ఆయన రెండు అరటి పళ్లను ఆర్డర్ చేసినందుకు రూ.442.50 బిల్లు వేశారు.
See this beer? That is the most expensive beer in history. I paid $99,983.64 for it in the Malmaison Hotel, Manchester the other night.Seriously.
Contd. pic.twitter.com/Q54SoBB7wu
— Peter Lalor (@plalor) September 5, 2019