మీ వాళ్లని తీసుకెళ్లండి.. లేదంటే కఠిన చర్యలే..

| Edited By:

Apr 13, 2020 | 6:43 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో ఉన్న విదేశీ కార్మికుల్ని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపని

మీ వాళ్లని తీసుకెళ్లండి.. లేదంటే కఠిన చర్యలే..
Follow us on

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో ఉన్న విదేశీ కార్మికుల్ని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపని వారి సొంత దేశాలపై కఠిన ఆంక్షలు విధిస్తామని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వదేశీయులకు ముప్పు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అక్కడి ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఆయా దేశాలకు ‘కోటా’ విధించి వ్యక్తుల్ని ఎంపిక చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

కోవిద్ 19 ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆయా దేశాలకు లేఖలు పంపామని.. అయినా ఎలాంటి స్పందన లేదని దీనితో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. అందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. యూఏఈలో ఉన్న విదేశీయుల్లో భారతీయ సమాజానిదే సింహభాగం. దాదాపు 33 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. ఇది ఆ దేశ జనాభాలో 30శాతం. దీనిపై భారత్‌లోని యూఏఈ రాయబారి అహ్మద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ అల్‌ బన్నా స్పందించారు. భారత్‌ సహా తమ దేశంలోని అన్ని రాయబార కార్యాలయాలకు ఈ సమాచారాన్ని అందజేశామని తెలిపారు.